కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.