కావలి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబలం పడిపూజ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని, భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శరణు ఘోషలతో కార్యక్రమాన్ని భక్తి సంపన్నంగా మార్చారు.