దగదర్తి మండలం మహానాడు వేడుకలతో పసుపుమయంగా మారింది. కంచర్ల వెంకటేశ్వర భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరయ్యారు. డప్పులు, పూలవర్షం, నినాదాల మధ్య ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. "దగదర్తి గడ్డ టీడీపీ అడ్డ" అంటూ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వేడుకల్లో భారీగా నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు.