కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు చెట్లు పంపిణీ చేశారు. విద్యార్థిని విద్యార్థులతో కలిసి సరస్వతి దేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే రూ. 35వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.