కావలి: ఒడ్డే ఓబన్న జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని లతా హాల్ సెంటర్ వద్ద, బ్రహ్మంగారి గుడి సమీపంలో ఆదివారం వడ్డె ఓబన్న 219వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వడ్డెర అంటే రాజు అని, బ్రిటిష్ వారిని గజగజలాడించిన వ్యక్తి వడ్డెర ఓబన్న అని కొనియాడారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్