కావలిలోని SAAP గ్రౌండ్ లో కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించారు. మహిళల ప్రతిభను అభినందిస్తూ, వారి కళాత్మకతను ప్రశంసించారు. ఎమ్మెల్యే ప్రతి ముగ్గు దగ్గర ఆగి మహిళలతో మాట్లాడి, వారితో ఫోటోలు దిగారు.