కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు నాయుడు రాంప్రసాద్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం ఆయనను పరామర్శించారు. సిరిపురం గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి, రాంప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.