కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం దగదర్తి మండలం తురిమెర్ల గ్రామంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను వెల్లడించాలని ఆయన కోరారు.