కావలి 26వ వార్డుకు చెందిన వైసీపీ ఇన్ ఛార్జ్ వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి బెంగుళూరులో యాక్సిడెంట్ అవ్వడంతో నడుముకు ఆపరేషన్ చేయించుకుని గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కావలిలోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు రాకూడదని జన సమీకరణ చేయకూడదని పేర్కొన్నారు. దీంతో నడవలేని నాయకుడికి నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.