కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలైన ఘటన జలదంకి పెట్రోల్ బంకు సమీపంలో గురువారం జరిగింది. కలిగిరి మండలం క్రాకటూరు గ్రామానికి చెందిన షేక్. ఇమామ్ ఖాసిం కొడుకుతో కబీర్ కలిసి బైకుపై కావలి బయలుదేరాడు. కొందరు జమ్మలపాలెంలో పెళ్లికి హాజరై తిరిగి తిరుపతి వెళ్ళుతుండగా జలదంకి పెట్రోల్ బంకు సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. బైక్ మీద ఉన్న కబీర్ కు గాయాలు కావడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.