కావలి రెడ్ క్రాస్ అధ్యక్షుడు, ఆర్డీఓ యం సన్నీ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, కావలి రెడ్ క్రాస్ సంస్థ P4 పథకం కింద 42 గిరిజన కుటుంబాలను దత్తత తీసుకోనుంది. సోమవారం రెడ్ క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో, కావలి పట్టణ శివార్లలోని చెరువు కట్ట గిరిజన సంఘంలో స్థానిక వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు బెజవాడ ప్రసన్నకుమార్ బృందం సర్వే నిర్వహించి 42 కుటుంబాలను గుర్తించింది. ఆర్డీఓ వంశీ కృష్ణ చేతుల మీదుగా ఈ కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.