కావలి: మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు

లేబర్ కోడ్స్ రద్దు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కావలి మున్సిపల్ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేసింది. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, 10 గంటల పని విధానాన్ని నిలిపివేయాలని, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్