కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ని ఆదివారం కావలి పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయం లో టిడిపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు మాలేపాటి సుబ్బా నాయుడు, దగదర్తి మండలం టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం విధివిధానాల పై ఎమ్మెల్యేతో చర్చించారు. దగదర్తి మండల అభివృద్ధికి తాము ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.