కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని సుమారు 35 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు చామన ఛాయతో, 5.7 అడుగుల ఎత్తుతో, బ్లూ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై కావలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.