కాకినాడ కింగ్స్ జట్టుకు ఎంపికైన కావలి యువకుడు

ఆంధ్ర ప్రీమియం లీగ్ (ఏపీఎల్) కు కావలి పట్టణం నుండి భార్గవ్ మహేష్ ను కాకినాడ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. గత ఏడాది భార్గవ్ అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడారు. కావలి క్రికెట్ అసోసియేషన్ కోచ్ రాజశేఖర్ పర్యవేక్షణలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు. కాకినాడ కింగ్స్ జట్టుకు భార్గవ్ ఎంపిక కావడం పట్ల కావలి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్