జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ప్రభుత్వ రాజముద్రతో నూతనంగా అందిస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం కావలి ఆర్డీవో కార్యాలయంలో కావలి డివిజన్ పరిధిలో అమలవుతున్న రెవెన్యూ సంబంధిత కీలక అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల భూహక్కులకు భరోసా కల్పించే ఈ పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయడంతో పాటు, ఈ-కేవైసీని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.