ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతికి లోక్‌సభలో చట్టబద్ధత కల్పించడంపై చర్చ జరగడం హర్షించదగిన విషయమని బీజేపీ నేత డాక్టర్ మహేంద్ర యాదవ్ అన్నారు. ఒక రాష్ట్ర అస్థిత్వానికి, అభివృద్ధికి రాజధాని ఒక చిరునామాగా ఉంటుందని, అమరావతి అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సహకరించాలని ఆయన కోరారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.