తండ్రి మరణంపై ధైర్యంగా ఇంటర్ పరీక్ష రాసిన యువతికి అండగా మేకపాటి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎర్రబల్లిపాలెం గ్రామానికి చెందిన మూలి జనార్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబం ఆపదలో పడింది. తండ్రి మృతదేహం ఇంట్లోనే ఉండగా, ధైర్యంగా ఇంటర్ పరీక్షకు హాజరైన పెద్ద కుమార్తె దేవసేన దీనస్థితిని చూసి చలించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణ సాయంగా రూ. లక్ష నగదును అందజేయడంతో పాటు, పిల్లల చదువులకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్