బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. తూర్పు, పడమర గాలిగోపురాలు, భక్తుల మెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విశ్రాంతి వసతులు మెరుగుపర్చాలని అధికారులకు సూచిస్తూ, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.