వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల

వింజమూరు పట్టణంలోని ఎస్వీ కళ్యాణ మండపంలో కేతనబోయిన వారి వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా శుక్రవారం హాజరయ్యారు. నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఆయన, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

సంబంధిత పోస్ట్