కావలి పట్టణంలోని 10వ వార్డులో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఉదయం పర్యటించి, ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికారులను ఆదేశించి సమస్యలకు పరిష్కారం చూపించారు. రైతులతో మమేకమై వారి కష్టసుఖాలు, పెట్టుబడులు, నష్టాల గురించి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.