కావలిలో జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కావలిలోని రవి నర్సింగ్ హోమ్‌లో జనవిజ్ఞాన వేదిక సైన్స్ వారోత్సవాల షెడ్యూల్‌ను ఆవిష్కరించింది. డాక్టర్ బెజవాడ రవికుమార్ షెడ్యూల్ విడుదల చేయగా, అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, నృత్యాలు, పాటలు, సైన్స్ ఎగ్జిబిషన్, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ముగింపు వేడుకలు, బహుమతుల ప్రదానం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్