కావలిలో ఒకరు అనుమానాస్పద మృతి

కావలి పట్టణంలోని వెంగాయగారిపాలెం రోడ్డులో అంబేద్కర్ నగర్‌కు చెందిన మచ్చల వెంకయ్య (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఒకటవ పట్టణ సీఐ ఫిరోజ్, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్