కావలి పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు జిల్లా కావలి పట్టణ వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు. 2 గంటల తరువాత యధావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్