సంగం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి, రెండవ ఫేస్ లో రబీ పంటలకు నీటిని అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.