బడితోట, కిచెన్ గార్డెన్.. విద్యార్థుల సేంద్రీయ సాగుతో ప్రశంసలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలిలోని దగదర్తి మండలం కట్టుబడిపాలెం అఫ్ చెన్నూరు పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు బీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన బడితోట, కిచెన్ గార్డెన్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులు స్వయంగా వ్యవసాయం చేస్తూ ఈ తోటలో రకరకాల పూల మొక్కలతో పాటు నిత్యం అవసరమయ్యే కూరగాయలను పండిస్తున్నారు. వంకాయ, బెండకాయ, టమోటా, పచ్చిమిర్చి, చిక్కుడు వంటి కూరగాయలతో పాటు గోంగూర వంటి ఆకుకూరలను సాగు చేస్తున్నారు. సేంద్రీయ సాగుపై శిక్షణ ఇస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్