నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కళ్యాణాన్ని దర్శించుకున్నారు.