కావలిలో TDP 44వ ఆవిర్భావ వేడుకలు … జెండా ఎగరవేసిన MLA

నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగరవేసి, పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్