కావలి పట్టణాన్ని పరిశుభ్రతలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణం కార్యక్రమంలో భాగంగా "మన కావలి–మన పరిశుభ్రత" నినాదంతో క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలోని పారిశుధ్య సమస్యలను అధికారులకు తెలియజేయవచ్చు. ఈ సమాచారం ఆధారంగా అధికారులు వేగంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.