మహిళను వేధించిన వారిని వదిలి పెట్టేది లేదు: కాకాణి

కావలిలో దాడికి గురైన మహిళను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కూటమి పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలపై వేధింపులు పెరిగాయని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపైనా, తప్పుడు ధ్రువపత్రాల అంశంపైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్