దగదర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గురం సంతోష్ (17) దుర్మరణం చెందాడు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సంతోష్ కావలి కాలువకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఆలస్యమైంది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.