వింజమూరు: అడవిలో వృద్ధుడి మృతదేహం గుర్తింపు

కావలి-ఉదయగిరి జాతీయ రహదారి సమీపంలోని ఊటుకూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించారు. ఎస్సై ఎం. ఉమామహేశ్వరరావు పరిశీలించగా, మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉందని, 4-5 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. సుమారు 65-75 ఏళ్ల వయసున్న మృతుడి వద్ద చెప్పులు, దుప్పటి, కండువా లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కనిపించకుండా పోయిన కేసులతో పోల్చగా, ఆనవాళ్లు సరిపోలలేదని వివరించారు.

సంబంధిత పోస్ట్