కావలి: క్షుద్రపూజల కలకలం

సైదాపురం మండలం తోటచం గ్రామ శివారులో బుధవారం రాత్రి క్షుద్రపూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, నిమ్మకాయలు, తమలపాకులతో పూజలు నిర్వహించారని గ్రామస్థులు తెలిపారు. స్థానిక ఆలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్