సింగారెడ్డి రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలను కావలి డీఎస్పీ వి. వి. రమణకుమార్ ఖండించారు. రవీంద్రరెడ్డి 9 కేసుల్లో నిందితుడని, రౌడీషీటర్ అని ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉండగా గత ఆదివారం రాకపోవడంతో పాటు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు అందడంతో కొండాపురం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించామని చెప్పారు. అనంతరం ఎంఆర్వో సమక్షంలో బైండ్‌ఓవర్ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, పోలీసులు నిర్బంధించారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.