ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కావలిలో వైసీపీ నేతలు ఫిర్యాదు

మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పై కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు జగన్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కుల విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని పేర్కొంటూ, నానాజీతో పాటు ప్రచారం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్