బోగోలు మండలం బిట్రగుంట ఎస్వీపాళేనికి చెందిన మారుబోయిన శీనయ్య (34) గత నెల 13న చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఆస్పత్రిలో చేరగా, మంగళవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బిట్రగుంట ఎస్సై రామకృష్ణ తెలిపారు.