హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా గండవరం శ్రీ ఉదయ కళేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఏరువాక ధాన్య లక్ష్మి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్, నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ పిటి జగన్నాథం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి కుమారి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కలసి వరి ధాన్యాలను పంపిణీ చేశారు.