ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం రాష్ట్రానికి మరువలేని రోజని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు గారి విజన్‌తో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.