బుచ్చి: బడ్జెట్ సమావేశం వాయిదా

బుచ్చి మున్సిపాలిటీలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం శుక్రవారం ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేయడంతో వాయిదా పడింది. బడ్జెట్ తమకు నచ్చలేదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. 2023-24 బడ్జెట్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్లో సైతం అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వివరాలు కోరుతూ, సమావేశం వాయిదా పడేలా చేశారని సమాచారం. ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి ఈ విషయాన్ని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్