జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం, జొన్నవాడలో గల శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం 9 గంటల నుంచి జరగనుంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్యభూమి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అధికారులు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగుతుంది.