బుచ్చిలో పెట్రోలు, డీజిల్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పలు పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా ఇంధనం లభ్యమవుతుందనే సమాచారం వస్తే అక్కడికి బారులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో, మార్గమధ్యంలో బైక్ ఆగిపోవడంతో ఒక వ్యక్తి బాటిల్ పట్టుకుని పెట్రోల్ బంకు వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా పెట్రోల్ లేకపోవడంతో, 'రూ. 100కైనా కొంచెం పట్టండి' అంటూ తన హెల్మెట్ చూపిస్తూ వేడుకున్నాడు. అతని దుస్థితి అక్కడున్న వారిని కలచివేసింది.