బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు వేగం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.