టీడీపీ సీనియర్ నాయకులు పురిని హరినాథ్ జొన్నవాడలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ఒక మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జొన్నవాడ గ్రామంలో అమ్మవారి దేవాలయంలో ప్రసన్న చేసిన అవినీతి చిట్టా తమ దగ్గర ఉందన్నారు. అవినీతిపరుడు, అక్రమాలకు పాల్పడ్డ ప్రసన్న తమ ఎమ్మెల్యేను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.