బుచ్చి: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో శుక్రవారం రోడ్డు దాటుతున్న హోంగార్డు శ్రీనివాసులు, ఆయన భార్య మహాలక్ష్మిని స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి తలకు తీవ్ర గాయాలవ్వగా, స్కూటీ నడుపుతున్న మహేష్కు కూడా గాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్