కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని రైతు సంఘం నాయకులు ముత్యాల గురునాథం ఆరోపించారు. బుచ్చిలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు ప్రాంతాల్లో యూరియా దొరకక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. స్మార్ట్ మీటర్ విధానం తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. రైతులకు ఉన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.