కొడవలూరు మండలంలో గంజాయి కలకలం

కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో గంజాయి పట్టివేత కలకలం రేపింది. సీఐ సురేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం, గండవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలను విచారించగా, వారి వద్ద ఏడు కిలోల గంజాయి ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్