విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కావడంతో నెల్లూరు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ చిన్న బజార్ కార్యాలయం వద్ద స్థానిక ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, ఈ రైల్వే జోన్ ద్వారా రైల్వే సేవల మెరుగుదల, ఉపాధి అవకాశాల పెరుగుదల, పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుందని, విశాఖపట్నం దేశంలోని ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా ఎదగనుందని తెలిపారు.