జొన్నవాడ అమ్మవారికి బంగారు, వెండి ఆభరణాల విరాళం

బుచిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానానికి భక్తులు 22 గ్రాముల బంగారు లక్ష్మీకాసుల హారం, 850 గ్రాముల వెండి కిరీటం సెట్టు, వెండి కర్ణపత్రములను విరాళంగా సమర్పించారు. దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్