మహిళలను అవమానించారని రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే బుర్రా ఫిర్యాదు

ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మహిళలను అవమానించే విధంగా వార్తలు ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ తీవ్రంగా విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో రాధాకృష్ణపై ఫిర్యాదు దాఖలు గురువారం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలు, విభేదాలు పెంచే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్