బుచ్చిరెడ్డిపాలెంలో బంగారు చైన్ దొంగతనం

బుచ్చి మండలం నాగమాంబాపురం ఎస్సీ కాలనీలో ఇసుక చెన్నమ్మ అనే మహిళ మెడలోని సుమారు మూడున్నర సవరాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బుచ్చి సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్